1.5.26

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి


తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం నృసింహ జయంతి ఘనంగా జరిగిందిప్రతి ఏటా వైశాఖ మాసంలో  ఉత్సవం నిర్వ‌హిస్తారుశ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి  సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.


శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉందియోగముద్రలో ఉన్న  విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారుస్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయికింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయిక్రీ. 1330 నుంచి క్రీ. 136మధ్య కాలంలో నిర్మితమైన  ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారుఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.


 కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment