13.5.26

జాపాలి హనుమాన్ కు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ japali hanuman




హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం ఉదయం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు.


ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవోఅదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారుస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సింధూర వస్త్రంతో ఈవోఅదనపు ఈవోలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారుఆహ్లాదకరమై వాతావరణంలో తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు జరుగుతున్నాయనిభక్తులందరూ సంతోషంగా దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పారుభక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.


 కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంవీజీవో శ్రీ సురేంద్రఇతర అధికారులు పాల్గొన్నారు.


అంతకు ముందు టీటీడీ ఈఓ మరియు అదనపు ఈఓ లు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారి మూలమూర్తికి జరిగి ప్రత్యేక అభిషేకంలో కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment