2.5.26

ధ్వజారోహణంతో న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం new delhi temple


న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయిరాత్రి 7.30 గంటలకు స్వామివారు పెద్ద‌శేష‌వాహనంపై విహ‌రించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారుసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలనుముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.


ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారుఅనంతరం అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించిపూజలు చేసిధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.


 కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డిఆలయ ఏఈవో శ్రీ బాల‌రాజుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్శ్రీ ఉదయ్ కుమార్ఆలయ అర్చకులుఇతర ధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.  


No comments:

Post a Comment