9.5.26

తిరుమలలో భక్తులకు విస్తృత వసతి సౌకర్యాలుtirumala









కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారుభక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత స్థాయిలో వసతివిశ్రాంతిలాకర్స్నానఅన్నప్రసాదం తదితర సదుపాయాలను కల్పిస్తోంది.


భక్తులు దర్శనానికి ముందు స్నానమాచరించి పవిత్రంగా స్వామివారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ కావడంతోభక్తుల ఆచారాలు మరియు మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలతిరుపతిలో అనేక వసతి గదులు మరియు యాత్రికుల వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది.


గదుల కేటాయింపు విధానం


తిరుమలలో వసతి గదులు పొందదలచిన భక్తులు సీఆర్వో జనరల్ కౌంటరులో ఆధార్ కార్డుఫోన్ నంబరు తదితర వివరాలను నమోదు చేసుకోవాలిఅనంతరం కేటాయించబడిన గది నంబరు ప్రాంత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు పంపబడతాయి.


భక్తులు సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో యూపీఐ/కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు.


తిరుమలలో స్థలాభావం కారణంగా 7800 వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నందునకుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.  ఒంటరి మరియు అవివాహిత స్త్రీపురుష జంటలకు  గదుల కేటాయించబడవు.


వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డుఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు

No comments:

Post a Comment