1.5.26

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు vasantotsavams







తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక సంతోత్సవాలు గురువారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయిమే 1 ఉదయం ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం న్నులపండువగా జరుగనుంది.


వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయిశ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవా ద్వారా ఆరాధించడం వల్ల భక్తులకు శారీరకమానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం.


వైభవంగా స్నపనతిరుమంజనం...


వసంతోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారుమధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో భాగంగా పసుపుకుంకుమపాలుపెరుగుతేనెచందనంకొబ్బరినీళ్లతో అభిషేకం చేశారురాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని లయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.  


శేషాచలాన్ని తలపించిన శుక్ర‌వార‌పుతోట‌


టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వార‌పు తోట‌లో శేషాచ‌లం అడవిని త‌ల‌పించేలా తీర్చిదిద్దారుపచ్చని చెట్లుపుష్పాలుజంతువుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆవుదూడకోతినెమలిహంసలు, చిలుకలు వంటి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


ఇందులో 300 కేజిల వ‌ట్టి వేరు, 500 కేజిల సాంప్ర‌దాయ పుష్పాలు, 15 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌తో వివి ర‌కాల ఫలాలు వినియోగించారుఇందులో బెంగళూరుహైద‌రాబాద్‌కు చెందిన అలంకరణ నిపుణులుటిటిడి సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.


 సంద‌ర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప‌న‌బాక ల‌క్ష్మీఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ఏఈవో  శ్రీ దేవ‌రాజులుఅర్చకులు శ్రీ బాబుస్వామిసూప‌రింటెండెంట్లు శ్రీ ముని చెంగ‌ల్రాయులుశ్రీ ర‌మేష్‌శ్రీ సురేష్టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ చ‌ల‌ప‌తివిశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment