3.5.26

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు vasatotsavams







తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి.


చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారుఅనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారుమధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారుఇందులో భాగంగా పసుపుకుంకుమపాలుపెరుగుతేనెచందనంపలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.


రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహ‌రీంద్ర‌నాథ్‌ఏఈవో శ్రీ దేవ‌రాజులుఅర్చకులు శ్రీ బాబుస్వామిసూప‌రింటెండెంట్లు శ్రీ సురేష్శ్రీ ముని చెంగ‌ల్రాయులుశ్రీ ర‌మేష్‌ టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ చ‌ల‌ప‌తిపెద్ సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment