5.5.26

సర్వభూపాల వాహనంపై వరదరాజస్వామి అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి దివ్య దర్శనం veda narayana swamy


నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం రాత్రిసర్వభూపాల వాహనంపై శ్రీ వరదరాజస్వామి అలంకారంలో స్వామివారు అద్భుతంగా విరాజిల్లుతూ భక్తులను కటాక్షించారు.


వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని స్తుతిస్తూ సాగగామంగళవాయిద్యాల నడుమ వాహనసేవ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కోలాహలంగా జరిగిందిమార్గమంతా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని పుణ్యఫలాన్ని పొందారు.


సర్వభూపాలులు” అంటే సమస్త రాజులు. “రాజా ప్రజారంజనాత్‌” అన్న న్యాయానికి అనుగుణంగా ప్రజలను రంజింపజేసే వారే నిజమైన రాజులుఅలాంటి రాజులందరికీ పరమాధిపతి భగవంతుడే అన్న భావాన్ని  వాహనసేవ ప్రతిబింబించింది.


మే 05 మంగళవారం ఉదయం 8 గంటలకు మోహిని అలంకారంలో పల్లకిపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారురాత్రి 8 గంటలకు విశేష గరుడ వాహనంపై శ్రీవారు భక్తులను అనుగ్రహించనున్నారు.


 వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డిటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులుశ్రీ చెంగల్రాయులులయ అర్చకులు పాల్గొనగాపెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

No comments:

Post a Comment