8.6.26

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation




వైజాగ్ కు చెందిన ఎంకే బిల్డర్స్ ఎండీ శ్రీ రామకృష్ణ ఆదివారం ఉదయం టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.


ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు పాల్గొన్నారు.


No comments:

Post a Comment