తిరుమల
శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌ను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం సంప్రదాయ ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, వీజీవోలు శ్రీ సురేంద్ర, శ్రీ గిరిధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment