2.6.26

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన టీటీడీ ఈవో karvetinagaram




కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ. రవిచంద్ర సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు.


సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూన్ 6 నుండి 14 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముందుగా జూన్ 2 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 5 అంకురార్పణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు.


ప్రధాన ఉత్సవాల విశేషాలు


జూన్ 6 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, జూన్ 9 సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం, జూన్ 10 గరుడసేవ, జూన్ 13 వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం


బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు వో తెలిపారు. విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, చలువ పందిళ్లు, క్యూలైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు తదితర ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ వేణుగోపాలస్వామి, అమ్మవార్ల దివ్య అనుగ్రహాన్ని పొందాలని సందర్భంగా ఈవో ఆకాంక్షించారు.


కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment