4.5.26

ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి దర్శనం sri vedanarayana murthy


నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.


వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తించగామంగళవాయిద్యాల డుమ వాహనసేవ వైభవంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


స్వామివారికి అలంకరించిన ముత్యాలహారాలు శాంతిప్రశాంతతను ప్రసాదిస్తూభక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.


 వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డిటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులుశ్రీ చెంగల్రాయులులయ అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment