జూలై
17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుంది.ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఈ కారణంగా ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ రద్దు చేసింది.
జూలై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
అదేవిధంగా జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయడం జరిగింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
No comments:
Post a Comment