ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, శ్రీరామ నామస్మరణల మధ్య స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు. హనుమంతునిపై శ్రీ కోదండరాముని అలంకారంలో స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు పుణ్యాహవాచనం, వసంతోత్సవం నిర్వహించనున్నారు.
రాత్రిగజవాహనంపైదివ్యదర్శనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment