26.7.26

కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు kalpavruksha vahanam





నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథస్వామివారు దివ్యమైన కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు.

గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ భక్తి పారవశ్యాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళదర్శనం పొందారు.

పురాణాల ప్రకారం కల్పవృక్షం కోరుకున్న కోర్కెలన్నింటినీ నెరవేర్చే దివ్య వృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఆ కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులందరికీ సకల ఐశ్వర్యాలు, శుభఫలితాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నారనే భావనతో భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో వాహనసేవలో పాల్గొన్నారు.

జూలై 26న ఉదయం శేష వాహనంపై, రాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే గరుడ వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment