ఆగస్టు 18న ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కల్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి.
ఆగస్టు 19నశ్రీరామపట్టాభిషేకం – గరుడవాహనంపైదివ్యదర్శనం
ఆగస్టు 19న ఉదయం యాగశాల పూజ, 6.30 గంటలకు స్నపన తిరుమంజనం, అనంతరం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహిస్తారు.
రూ.300తోఆర్జితసేవలోపాల్గొనేఅవకాశం
గృహస్తులు (ఇద్దరు) రూ.300 చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొన్న దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
మూడురోజులపాటుఆధ్యాత్మికసాంస్కృతికకార్యక్రమాలు
మహోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టిటిడి కోరుతోంది.
No comments:
Post a Comment