28.9.25

క‌ల్ప‌వృక్ష వాహనసేవలో కళాబృందాలు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ art forms






















శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో 4వ‌ రోజైన శ‌నివారం ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 9 రాష్ట్రాల నుంచి 18 కళా బృందాలలో మొత్తం 513 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో వాహనసేవ శోభను మరింత పెంచారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల‌కు చెందిన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా 18 రకాల సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలిచ్చాయి.
మహారాష్ట్రకు చెందిన 111 మంది కళాకారులు ప్రదర్శించిన 'డ్రమ్ము విన్యాసాలు' భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ నుంచి జానపద నృత్యం, కోయ నృత్యం బృందాలు, ఒడిస్సా నుంచి దల్కాయ్, ఒడిశా జానపద నృత్యం, గుజరాత్ నుంచి దాకలదుడియ, రాజస్థాన్ నుంచి దాండియా, ఉత్తరాఖండ్ నుంచి చోలియా వంటి వివిధ ప్రాంతీయ కళా రూపాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి, దశావతారాలు, చెక్కభజన, డప్పు నృత్యం, కోలాటం బృందాలు ఆకట్టుకున్నాయి. కల్పవృక్ష వాహన సేవకు హాజరైన భక్తులు కళాకారుల ప్రదర్శనలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment