23.1.26

ఫిబ్రవరిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు govindaraja swamy vari temple




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయివాటి వివరాలు ఇలా ఉన్నాయి.


-   ఫిబ్ర‌వ‌రి 1 శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి తెప్పోత్స‌వాలు ముగింపు.


•  ఫిబ్రవరి 3 ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం సంద‌ర్భంగా సాయంత్రం శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.


•  ఫిబ్రవరి 5 ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం గంట‌లకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.


•  ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం సాయంత్రం 6 గంట‌లకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్‌ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.


•  ఫిబ్రవరి 7 అధ్యాయ‌నోత్స‌వాల‌లో భాగంగా పెద్ద శాత్తుమొర సంద‌ర్భంగా సాయంత్రం 5.30 గంట‌లకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారుశ్రీన‌మ్మ‌ళ్వార్‌ ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించ‌నున్నారు.


-  ఫిబ్రవరి 10 అధ్యాయ‌నోత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా ఉద‌యం శ్రీదేవిభూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారుశ్రీ ఆండాళ్ అమ్మ‌వారుసేనాధిప‌తివారుఆళ్వార్లు కపిలతీర్థం వద్దగల ఆళ్వార్‌ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి శాత్‌మొర‌ఆస్థానం నిర్వ‌హిస్తారుఅనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.


•  ఫిబ్రవరి 12 శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా నిర్వ‌హించ‌నున్న గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా ఉద‌యం 6.30 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆండాళ్‌ మ్మవారి మాలల ఊరేగింపు.  


-  ఫిబ్రవరి 16 శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం గంటలకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.


-     ఫిబ్ర‌వ‌రి 25 రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణిసత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

No comments:

Post a Comment