18.1.26

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం paripeta utsavam






తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో   శ‌నివారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగిందిప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

 

 సందర్భంగా సాయంత్రం 3.30 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారుశ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారుఅక్కడ ఆస్థానం నిర్వహించారు.  స్వామివారి వేటను తిలకించడానికి పార్వేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారుతిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు.

 

 కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ వో శ్రీమతి శాంతిఏఈవో శ్రీ నారాయ‌ణ‌ చౌద‌రిసూప‌రింటెండెంట్ శ్రీ చిరంజీవిఆలయ అర్చకులుఇతర అధికారులుభక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment