తిరుపతిలోని
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా సాయంత్రం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. స్వామివారి వేటను తిలకించడానికి పార్వేట మండపానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments