Featured Post

శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు appalayagunta

జూన్ 25 నుంచి జూలై 3 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవ వైభవానికి ముస్తాబవుతున్న అప్పలాయగుంట భక్తులందరికీ మరపురాని ఆధ్యాత్మిక...

10.6.26

శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు appalayagunta





జూన్ 25 నుంచి జూలై 3 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవ వైభవానికి ముస్తాబవుతున్న అప్పలాయగుంట

భక్తులందరికీ మరపురాని ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలిజేఈవో డా. . శరత్

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 25 నుండి జూలై 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో డా. . శరత్ ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం ఆలయ పరిసరాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆలయ సమీపంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు చేరవేసేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో ధర్మరథం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రోమోలు ప్రసారం చేయాలన్నారు.

భక్తులకు సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యం

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మజ్జిగ, ప్రసాదాల పంపిణీతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జూన్ 28 కల్యాణోత్సవం, జూన్ 29 గరుడసేవ, జూలై 2 రథోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

పరిశుభ్రత, భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు

విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించాలని జేఈవో సూచించారు.

విద్యుత్, పుష్పాలంకరణలతో దివ్య శోభ

ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

భక్తులను అలరించనున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాల, హెచ్డీపీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

జూన్ 24 అంకురార్పణ, జూన్ 25 ధ్వజారోహణం, జూలై 3 చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను జేఈవో ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సూర్య కుమారాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, శ్రీ సెల్వం, విజీవో శ్రీ గిరిధర్, ఎస్ఈ శ్రీ నరసింహమూర్తి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, సీఎంవో డా. కుసుమకుమారి, ఏఈవో శ్రీ దేవరాజులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Lord Venugopala Swamy Varu on Kalpavriksha Vahanam




The annual Brahmotsavams of Sri Venugopala Swamy, along with Sri Rukmini and Sri Satyabhama, are being celebrated grandly at Karvetinagaram.


On the fourth day of the festival on Tuesday morning, the Lord appeared as Kaliyamardana on the Kalpavriksha Vahanam and blessed devotees with a divine darshan.


The procession through the temple streets was held amidst Govinda Nama Sankeertana, bhajans, and traditional performances. Devotees offered harathi and participated with great devotion, seeking the Lord’s blessings for prosperity and well-being.


Temple officials, priests, and a large number of devotees took part in the event.

Robust Arrangements for Sri Prasanna Venkateswara Swamy Vari Brahmotsavams




Annual Brahmotsavams from June 25 to July 3

TTD JEO Dr. A. Sarat directed officials to make comprehensive arrangements for the annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, scheduled from June 25 to July 3.

After inspecting the temple premises and reviewing preparations on Tuesday, he instructed officials to ensure smooth darshan, devotee convenience, cleanliness, security, traffic management, and adequate drinking water facilities.

He also called for wide publicity through HDPP and SVBC, attractive illumination and floral decorations, and special spiritual and cultural programmes. Wall posters and invitation cards for the Brahmotsavams were unveiled on the occasion.

కల్పవృక్ష వాహనంపై కాళీయమర్దనుడిగా దివ్య దర్శనం kalpa vriksha vahanam





కార్వేటినగరం శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవాలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు కాళీయమర్దనుడి అలంకారంలో ల్పవృక్ష వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.

గ్రామ వీధుల్లో స్వామివారి వాహనసేవ అత్యంత వైభవోపేతంగా సాగింది. వాహనం ముందుగా భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలు నిర్వహిస్తూ గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.


మంగళవాయిద్యాల నినాదాల మధ్య స్వామివారి ఊరేగింపు కనులపండువగా సాగగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో సేవలో పాల్గొన్నారు.


పురాణాలలో కల్పవృక్షం కోరిన వరాలన్నింటినీ ప్రసాదించే దివ్య వృక్షంగా వర్ణించబడింది. అటువంటి కల్పవృక్ష వాహనంపై కాళీయమర్దనుడి రూపంలో విరాజిల్లిన శ్రీ వేణుగోపాలస్వామి భక్తుల కోర్కెలను తీర్చి, సకల శుభాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆశీర్వదించినట్లుగా భక్తులు భావించి పరవశించిపోయారు.


కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ర్చకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

9.6.26

Devotees Donates ₹ 10 Lakhs to TTD




Mr. Bhooram Tirumala Deekshith, a software engineer from Hyderabad, donated Rs.10 lakhs to the TTD Sri SV Annadanam Trust on Monday.


The donor handed over the donation DD to TTD Chairman Mr. B.R. Naidu at his Hyderabad office.


Retired Engineer Mr. B. Jagadeeshwar, father of the donor, and family members were also present on the occasion.


Sri Venugopala Swmay Varu Appears as Yoga Narayana on Simha Vahanam




As part of the annual Brahmotsavams at Sri Venugopala Swamy Temple, Karvetinagaram, Lord Sri Venugopala Swamy, accompanied by Sri Rukmini and Satyabhama, blessed devotees on Monday morning in the divine attire of Yoga Narayana atop Simha Vahanam.


The Simha Vahanam symbolizes courage, strength, and unwavering devotion. Devotees thronged the temple and participated in the Vahana Seva amid continuous chants of “Govinda”.


Temple officials, priests, and a large number of devotees attended the event.

సింహవాహనంపై యోగనారాయణుడిగా దివ్య దర్శనమిచ్చిన శ్రీ వేణుగోపాలస్వామి simha vahanam




కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ యోగనారాయణుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.


యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, ధైర్యానికి, శీఘ్రగమనానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తిశ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడని ధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే స్వామివారు రాక్షసు హృదయాలలో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతారని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది.


సందర్భంగా జరిగిన వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించి పరవశించారు.