Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

9.5.26

అన్నమయ్య సూక్తులు జీవితానికి ఆధ్యాత్మిక మార్గదర్శకాలు : డా. హేమంత్ కుమార్ annamaya





తాళ్లపాక అన్నమాచార్యుల సూక్తులు భక్తినీతిమానవతా విలువలను ప్రజల్లో పెంపొందించే దివ్య సందేశాలని తిరుపతికి చెందిన డాహేమంత్ కుమార్ తెలిపారుఅన్నమాచార్యుల 618 జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం నిర్వహించిన సాహితీ సదస్సులు భక్తి వాతావరణంలో ఘనంగా ముగిశాయి.


అన్నమయ్య సూక్తులు – జన జీవనం అనే అంశంపై మాట్లాడిన డాహేమంత్ కుమార్అన్నమయ్య కీర్తనలు కేవలం భక్తి గీతాలు మాత్రమే కాకుండా మానవ జీవితానికి సన్మార్గం చూపే ఆధ్యాత్మిక సందేశాలని పేర్కొన్నారుఆయన రచనల్లో ధర్మంనీతిసత్యంసమాజ సంస్కరణ వంటి విలువలు ప్రతిబింబించాయని చెప్పారు.


తాళ్లపాక కవులు – తిరుమల కైంకర్యాలు” అనే అంశంపై తాళ్లపాక వంశీయులు శ్రీ హరినారాయణాచార్యులు మాట్లాడుతూఅన్నమయ్య మరియు వారి వంశస్థులు జీవితాంతం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవకే అంకితమయ్యారని తెలిపారుసంకీర్తనల ద్వారా శ్రీనివాసుని మహిమను ప్రపంచానికి చాటిచెప్పారని వివరించారు.


అన్నమయ్య సంకీర్తనలు – ఆధ్యాత్మికత” అనే అంశంపై డావాసుదేవ రావు మాట్లాడుతూఅన్నమయ్య సంకీర్తనలు ప్రజలను భక్తివైరాగ్యంమోక్ష మార్గం వైపు నడిపించే దివ్య గానమని చెప్పారుభక్తి ద్వారా వేదాంతాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అని కొనియాడారు.


సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో సంగీతనృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డామేడసాని మోహన్సంచాలకులు శ్రీమతి లతపెద్ద సంఖ్యలో భక్తులుసాహితీప్రియులు పాల్గొన్నారు.


SRI KODANDARAMA SWAMY ASTHANAM HELD GRANDLY WITH DEVOTIONAL FERVOUR



As part of the Annamayya Jayanthi celebrations, Sri Kodandarama Swamy Asthanam was held grandly at Annamacharya Kalamandiram in Tirupati on Friday morning amidst devotional chants and spiritual fervour.


The Utsava idols were taken in procession from Sri Kodandarama Swamy Temple to the venue with traditional honours. Artists of the Annamacharya Project rendered soulful sankeertans praising Lord Sri Rama and delighted the devotees.


Music concerts, Harikatha, devotional dance and cultural programmes were also organised as part of the celebrations.


Special Officer of Annamacharya Project Dr. Medasani Mohan, Director Smt. Latha, Temple Inspector Sri Suresh and a large number of devotees participated in the programme.

భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం









అన్నమయ్య యంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం వైభవంగా నిర్వహించారుశ్రీరామనామ స్మరణతోగోవిం నామసంకీర్తనల మధ్య జరిగిన  కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక నందంలో ముంచెత్తింది.


ముందుగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ అన్నమాచార్య ళామందిరానికి తీసుకొచ్చారు సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భక్తిరసభరిత సంకీర్తనలను ఆలపించి శ్రీరామ భక్తిని పరవశింపజేశారుఅనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు.


ఉదయం నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు “రామచంద్రుడితడు రఘువీరుడు”, “జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం”, “జయ జయ రామ”, “రాముడు రాఘవుడు” తదితర సంకీర్తనలను మధురంగా ఆలపించి భక్తులను అలరించారు.


తదనంతరం తిరుపతికి చెందిన శ్రీ హేమప్రకాశ్ బృందం గాత్ర సంగీత సే అందించగాశ్రీ వేంకటేశ్వర్లు భాగవతార్ హరికథా గానం ద్వారా శ్రీరాముని మహిమను భక్తులకు వినిపించారు.


సాయంత్రం బెంగళూరుకు చెందిన శ్రీమతి స్వాతి రామలక్ష్మీ బృందం సంగీత సభ నిర్వహించనుండగాఅనంతరం కుమారి శ్రీ నయనప్రియ బృందం “శ్రీరామ జననం” నృత్యరూపకాన్ని ప్రదర్శించనున్నారు.


మహతి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు


మహతి కళాక్షేత్రంలో సాయంత్రం తిరుపతికి చెందిన శ్రీమతి రమణిశ్రీ రాజేష్‌కుమార్ బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించనుండగారాత్రి హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి స్వాతిరెడ్డి బృందం భక్తిరసభరిత నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డామేడసాని మోహన్‌డైరెక్టర్ శ్రీమతి లత‌శ్రీ కోదండరామస్వామి లయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్‌తో పాటు విశేష సంఖ్యలో క్తులు పాల్గొన్నారు.

SRIVARI SWARNA RATHOTSAVAM MESMERISES DEVOTEES





The grand Swarna Rathotsavam of Sri Kalyana Venkateswara Swamy Temple was held with religious fervour on Friday evening as part of the annual Vasanthotsavams.


Sri Kalyana Venkateswara Swamy along with Sridevi and Bhudevi blessed devotees while taking a procession on the glittering golden chariot around the four mada streets of the temple. Large numbers of women devotees participated enthusiastically and pulled the chariot amid Govinda chants, Vedic hymns and Mangala Vadyams.


Earlier in the day, Suprabhatham, Thomala, Koluvu, Panchanga Sravanam, Sahasranamarchana and Snapana Tirumanjanam were performed to the deities.


Deputy EO Smt. Varalakshmi, Superintendent Sri Raj Kumar, Temple Inspectors Sri Muni Kumar and Sri Dhanasekhar, engineering officials and a large number of devotees participated in the event.

భక్తులను మంత్రముగ్ధులను చేసిన శ్రీవారి స్వర్ణరథోత్సవం swarnarathotsavam






శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన స్వర్ణరథోత్సవం భక్తి పారవశ్యంలో కన్నుల పండుగగా జరిగిందిదివ్య కాంతులతో మెరిసిన స్వర్ణరథంపై శ్రీదేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయ కటాక్షాలు ప్రసాదించారు.


గోవిందా… గోవిందా…” నామస్మరణల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగడం విశేషంగా ఆకట్టుకుందిమంగళ వాయిద్యాలువేదఘోషలుహారతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలకొలువుపంచాం శ్రవణంసహస్రనామార్చన నిర్వహించారుఅనంతరం ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.


మధ్యాహ్నం జరిగిన స్నపన తిరుమంజనంలో పాలుపెరుగుతేనెకొబ్బరి నీళ్లుపసుపుచందనంతో పవిత్ర అభిషేకం నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిసూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధనశేఖర్‌ఇంజనీరింగ్ అధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.