TTD Chairman Sri B.R. Naidu felicitated Indian women’s cricketer Sree Charani, from Kadapa district of AP who played a crucial role in the victory of the recently held ICC Women's World Cup.
After having darshan of Sri Venkateswara Swamy, Sree Charani called on the TTD Chairman at the camp office in Tirumala on Saturday.
On this occasion, the Chairman felicitated her with a shawl and presented her with Srivari Theertha Prasadams.
He conveyed his best wishes that with the blessings of Sri Venkateswara Swamy, she would continue to scale greater heights in her cricketing career in future.
TTD Board Member Sri Bhanu Prakash Reddy was also present.
The annual Karthika Brahmotsavams are set to witness a wide range of colourful devotional cultural programmes from November 17 to 25.
Everyday these cultural programmes will be observed on various stages including Astana Mandapam at Tiruchanoor, besides Mahati, Annamacharya Kalamandiram in Tirupati.
TTD is set to invite the same artistes who excelled with their artistic performances during Tirumala Brahmotsavams held in September this year and enthralled the devotees.
This year during Sri Padmavati Ammavari Brahmotsavams, renowned artistes from Maharashtra, Odisha, UP, West Bengal besides southern states are set to muse the devotees.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుచానూరు, తిరుపతిలలోని పలు వేదికలపై ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థానమండపంలో ప్రతి రోజు ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు లక్ష్మీ సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించనున్నారు.
ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తామృతం (ధార్మికోపన్యాసం), ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు హరికథ పారాయణం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు అన్నమయ్య సంకీర్తనలను గానం చేయనున్నారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు, రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు, తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలలో టీటీడీ అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి 206 కళాబృందాలు ప్రదర్శనలు ఇ్వనున్నారు.
ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణిని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు అభినందించారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం శ్రీ చరణి శనివారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఆమెను శాలువతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తు లో క్రికెట్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా పాల్గొని శ్రీచరణికి అభినందనలు తెలిపారు.