Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

24.6.26

₹10 Lakhs Donation to TTD




Sri Kalla Satya Rishabh from Hyderabad donated Rs. 10,01,116 to the TTD Sri Venkateswara Gosamrakshana Trust on Tuesday.

To this extent, the donor handed over the donation DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the latter's Camp Office in Tirumala.

Annual Jyestabhishekam from 26th June to 28th June




Srivari Salakatla Jyeshtabhishekam will be held at the Srivari Temple in Tirumala from June 26 to 28.

Every year, in the Jyeshtamasa, Jyeshtabhishekam is performed for three days, the last day coinciding with Jyeshta Nakshatra. 

This ritual is being performed at the Kalyana Mandapam in Sampangi Prakaram and is also known as ‘’Abhidhyeyaka Abhishekam’’. 

The significance of this ritual involves the protection of the age old ceremonial idols of the deities from wear and tear due to the abhishekams performed over generations. 

On the first day, the golden armour of Sri Malayappa Swamy is removed, and homas, abhishekams and Panchamrutha Snapana Tirumanjanam is performed.  

After that, the processional deity is adorned with a diamond armour. After similar holy bath on the second day, the deity is decked with a pearl armour. On the third day, the deity is adorned with the gold armour again. 

This gold armour is taken off only in the next year during the time of Jyeshtabhishekam. Until the processional deity of Sri Malayappa Swamy participates in various festivals in the same gold armour throughout the year to bless His devotees.

In view of the Srivari Jyeshtabhishekam, TTD has cancelled the Arjita Sevas including Kalyanotsavam, Unjal Seva, and Arjita Brahmotsavam on June 28.

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koilalwa rtirumanjanam




అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. జూన్ 24 నుండి జూలై 3 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.


ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, అర్చన అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ గర్భగుడి, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షించారు.


పవిత్ర కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సుగంధాలతో పరిమళించి, భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం భక్తులకు ర్వదర్శనం కల్పించారు.


వార్షిక బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ జూన్ 24 రాత్రి 7.30 గంటలకు అంకురార్పణం నిర్వహించనున్నారు. జూన్ 25 ధ్వజారోహణంతో సక దేవతలను ఆహ్వానిస్తూ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా జూన్ 28 ఆర్జిత కల్యాణోత్సవం, జూన్ 29 గరుడసేవ, జూలై 2 రథోత్సవం, జూలై 3 చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు.


దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కృపాకటాక్షాలను పొందాలని టీటీడీ కోరుతోంది.


కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం jyestabhishkam




జూన్ 26 నుండి 28వ‌ తేదీ వరకు తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది.


ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.


సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.


మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.


ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు.


ఆర్జిత సేవ‌లు ర‌ద్దు


కాగా జ్యేష్టాభిషేకాన్ని పుర‌స్క‌రించుకుని జూన్ 28వ తేదిన కళ్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Koil Alwar Tirumanjanam Performed at Sri Prasanna Venkateswara Swamy Vari Temple





The sacred Koil Alwar Thirumanjanam was performed in a traditional and grand manner at Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, on Tuesday ahead of the annual Brahmotsavams scheduled from June 24 to July 3.

The temple premises were ceremonially cleansed and sanctified with aromatic herbal ingredients as per Agama traditions. Devotees were later allowed for darshan.

Ankurarpanam will be held on June 24 at 7.30 pm, marking the commencement of the annual Brahmotsavams. Dhwajarohanam will take place on June 25, while Garuda Seva is scheduled for June 29, Rathotsavam on July 2, and Chakrasnanam with Dhwajavarohanam on July 3.

TTD has made elaborate arrangements for the convenience of devotees attending the festivities.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన శ్రీ కల్లా సత్య రిషబ్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు.


మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

23.6.26

Pushpa Yagam Perfomed Grandly at Sri Govindaraja Swamy Vari Temple






The annual Pushpa yagam was conducted with religious fervour at Sri Govindaraja Swamy Temple, Tirupati, on Wednesday.

The utsava deities of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi were offered Snapana Tirumanjanam in the morning. Later, Pushpayagam was performed amidst Vedic chanting and mangala vadyams.

Over three tonnes of flowers and sacred leaves, donated by devotees from Andhra Pradesh, Tamil Nadu and Karnataka, were offered to the deities as part of the ritual.

In the evening, the deities were taken in a procession around the four Mada Streets, blessing devotees.

TTD officials, temple priests and a large number of devotees participated.

E-Auction of 7,938KG Mixed Rice on 7th July




TTD will conduct an e-auction of 7,938 kg of mixed rice (20 lots), received through Hundi offerings at Tirumala Srivari  Temple and other TTD temples, on July 7, 2026.

The auction will be held through the Andhra Pradesh Government's Konugolu Portal under Auction ID No. 26120. The EMD is Rs.50,000.

Interested bidders may visit konugolu.ap.gov.in for details or contact the Office of the General Manager (Auctions), TTD, at 0877-2264429 or gmauctionsttd@gmail.com.

Koil Alwar Tirumanjanam at Sri Prasanna Venkateswara Swamy Vari Temple on 23rd June




TTD will conduct Koil Alwar Tirumanjanam, the traditional temple cleansing ritual, at Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, on June 23, ahead of the annual Brahmotsavams scheduled from June 24 to July 3.


The ritual will be held from 8 am to 10.30 am after Suprabhatham, Thomala Seva, Koluvu and Archana. Devotees will be allowed for darshan from 11 am onwards.


The Brahmotsavams will commence with Dwajarohanam on June 25. Major events include Arjita Kalyanotsavam (June 28), Garuda Seva (June 29), Rathotsavam (July 2) and Chakrasnanam with Dwajavarohanam (July 3).


TTD has made elaborate arrangements for devotees and appealed to them to participate in large numbers and seek the blessings of Sri Prasanna Venkateswara Swamy.

7,938 కిలోల మిశ్రమ బియ్యం ఈ-వేలం e auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని 2026, జూలై 07న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని (20 లాట్లు) విక్రయిస్తారు. ఈ వేలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఆక్షన్ ఐడీ నెం. 26120 కింద జరగనుంది.


వేలంలో పాల్గొనదలచిన వారు రూ.50,000 ఈఎండీ చెల్లించాలి. వివరాలకు http://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే టీటీడీ వేలాల విభాగం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబర్‌లో లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

జూన్ 23న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం applaayagunta




అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూన్ 23న వైభవంగా జరగనుంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టనున్నారు.


మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, అర్చన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

జూన్ 25న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 28న ఆర్జిత కల్యాణోత్సవం, జూన్ 29న గరుడసేవ, జూలై 2న రథోత్సవం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఈ దివ్యోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

22.6.26

మూడు టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగ మహోత్సవం pushpa yagam









తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు.


అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగాన్ని నిర్వహించడం ఆలయ సంప్రదాయం.


సందర్భంగా తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దమనము, బిల్వం, పన్నీరాకు తదితర 6 రకాల పవిత్ర పత్రాలతో కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు పుష్పాలను విరాళంగా అందించారు.


సాయంత్రం స్వామివారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించారు.


కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎస్. శ్రీనివాసులు, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ రంజిత్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

₹1 Cr Donation to SV Pranadana Trust




Mr. Anne Srinivasa Rao, Founder and Chairman of Sri Venkateswara Temple, Shaikpet, Hyderabad, donated Rs.1 crore to TTD's SV Pranadana Trust, which provides life-saving medical assistance to poor patients.

He handed over the DD to TTD EO Mr. Muddada Ravichandra at the EO's camp office in Tirupati on Sunday.

The EO appreciated the donor for his generous contribution and philanthropic gesture.

TTD Board Member Mr. N. Sadasiva Rao and the donor's family members were present.