చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 23 నుండి 26వ తేదీ వరకు ''బాలాలయం'' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం అంకురార్పణ, శాంతి హోమం, కళాకర్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ''బాలాలయం'' చేపడతారు. ఇందుకోసం ఆలయంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 24న ఉదయం అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, సాయంత్రం మహా శాంతి హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 25న ఉదయం బాలాలయ స్థాపనారాధన, చతుర్థశ కళశారాధన, పంచగవ్యాధివాసం, సాయంత్రం మహాశాంతి అభిషేకం, వైదిక కార్యక్రమాలు చేపడతారు.
ఫిబ్రవరి 26న ఉదయం 7.30 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షణ, బాలాలయ సంప్రోక్షణం, ధ్రువ కల్యాణం చేపడతారు.


No comments:
Post a Comment