తమిళనాడు
రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 07వ తేదీ నుండి 16వ తేదీ వరకు చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలలో సోమవారం (09వ తేదీ) ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై విహరించి భక్తులకు అనుగ్రహించారు. రాత్రి సింహ వాహనంపై విహరిస్తారు.
శ్రీ పద్మావతీ అమ్మవారు ఉదయం 09. గం.లకు రాత్రి 07 గం.లకు పలు వాహనాలపై విహరించి భక్తులకు అనుగ్రహించనున్నారు.
వాహన సేవల వివరాలు
ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం
ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజ వాహనం
ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం
ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్ర ప్రభ వాహనం
ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 8.30 గం.లకు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 11 గం.లకు చక్ర స్నానం, రాత్రి 7.30 ధ్వజావరోహణం
ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 06 గం.లకు పుష్పయాగం జరుగనుంది.
బ్రహ్మోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ధనంజయ, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, అర్చకులు, భక్తులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment