18.2.26

శాస్త్రోక్తంగా శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ‌కు అంకురార్పణ ankurarpanam






నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 22 తేదీ వ‌ర‌కు జరుగనున్న విమాన జీర్ణోద్ధరణ అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వర‌ణం,  పుణ్య‌హ‌ం మృత్సంగ్రహణంఅంకురార్ప‌ణం నిర్వహించారు.


 సందర్భంగా ఫిబ్రవరి 18 ఉద‌యం అష్ట బంధన సమర్పణసాయంత్రం పుణ్యాహంపంచాగ్ని ప్రతిష్ఠకుం వాహనంఆరాధనహోమంపూర్ణాహుతిఫిబ్రవరి 19 పంచ గవ్యాధివాసంనవ కలశ స్నపనం చేపట్టనున్నారు.


ఫిబ్రవరి 20 ఉద‌యం క్షీరాబ్ధివాసంసాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు,   ఫిబ్రవరి 21 ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది.


ఫిబ్రవరి 22 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణంఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారుఅనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.


No comments:

Post a Comment