10.2.26

శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో అలరించిన సంగీత నృత్య కళాశాల కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు culturala feast






శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన సోమ‌వారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేశాయి.


ఇందులో భాగంగా సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నాదస్వర మరియు డోలు పాఠశాల అధ్యాపకులు శ్రీ మునిరత్నం మరియు శ్రీ కృష్ణమూర్తి నాదస్వరంశ్రీ నాగరాజుశ్రీ‌ శివకుమార్ మరియు శ్రీ కృష్ణమూర్తి బృందం డోలు ఆకట్టుకుందికచేరీలో భాగంగా  శ్రీ మహాలక్ష్మి....పరంధామ....., అను కృతులు నాదస్వర డోలు కచేరి అందరిని అల‌రించింది.


త‌రువాత సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 గంట‌ల వ‌ర‌కు వేణుగాన కచేరీలో డా.అనంత కృష్ణ వేణువు, డా.మండా వయొలిన్శ్రీ జయరామ్ మృదంగం " శివ శివయనరాద....., మామవ సదా జనని....., ఏమి సేతుర లిం....., అను కృతులు వేణువు పై పాడి ప్రేక్షకులను అలరించారు.


తదుపరి రాత్రి 7:30 నుంచి 8:30 గంట‌ల వ‌ర‌కు జరిగిన కళాశాల కూచిపూడి విభాగ అధ్యాపకురాలు కళారత్న డా|| ఉషారాణి బృందం " వినాయక కౌతమ్...., శాంబ శివాయణవే....., శివ పంచాక్షరి....., ఐగిరి నందిని...., వంటి అంశాలతో అందరిని ఆకట్టుకున్నారుకూచిపూడి నృత్య కార్యకమంలో భాగంగా ప్రగతిపునీతశ్రీద్వితిస్ట శ్రీనాగ శ్రీ విద్యవీక్షితశన్వికఆశ్రితశ్రియ జోషెర్శ్వేత శ్రీదీప్తికహేమశ్రీ వస్తాలవంశికసాయి హర్షినిఙ్ఞాన ప్రసూశ్రీ ప్రశస్తినిశ్రీ వర్దిని పాల్గొన్నారు.

No comments:

Post a Comment