శ్రీ
కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
ఇందులో భాగంగా సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నాదస్వర మరియు డోలు పాఠశాల అధ్యాపకులు శ్రీ మునిరత్నం మరియు శ్రీ కృష్ణమూర్తి నాదస్వరం, శ్రీ నాగరాజు, శ్రీ శివకుమార్ మరియు శ్రీ కృష్ణమూర్తి బృందం డోలు ఆకట్టుకుంది. కచేరీలో భాగంగా శ్రీ మహాలక్ష్మి...., పరంధామ....., అను కృతులు నాదస్వర డోలు కచేరి అందరిని అలరించింది.
తరువాత సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు వేణుగాన కచేరీలో డా.అనంత కృష్ణ వేణువు, డా.మండా వయొలిన్, శ్రీ జయరామ్ మృదంగం " శివ శివయనరాద....., మామవ సదా జనని....., ఏమి సేతుర లింగ....., అను కృతులు వేణువు పై పాడి ప్రేక్షకులను అలరించారు.
తదుపరి రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు జరిగిన కళాశాల కూచిపూడి విభాగ అధ్యాపకురాలు కళారత్న డా|| ఉషారాణి బృందం " వినాయక కౌతమ్...., శాంబ శివాయణవే....., శివ పంచాక్షరి....., ఐగిరి నందిని...., వంటి అంశాలతో అందరిని ఆకట్టుకున్నారు. కూచిపూడి నృత్య కార్యకమంలో భాగంగా ప్రగతి, పునీతశ్రీ, ద్వితిస్ట శ్రీ, నాగ శ్రీ విద్య, వీక్షిత, శన్విక, ఆశ్రిత, శ్రియ జోషెర్, శ్వేత శ్రీ, దీప్తిక, హేమశ్రీ వస్తాల, వంశిక, సాయి హర్షిని, ఙ్ఞాన ప్రసూన, శ్రీ ప్రశస్తిని, శ్రీ వర్దిని పాల్గొన్నారు.
No comments :
Write comments