19.2.26

తిరుమలలో పాద రక్షల ట్రాకింగ్ వ్యవస్థకు విశేష స్పందన footwear







తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అమలు చేస్తున్న QR కోడ్ ఆధారిత పాద రక్షల ట్రాకింగ్ & మేనేజ్‌మెంట్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ విశేష ఫలితాలను అందిస్తోందిఆధునిక సాంకేతికతతో అమలులోకి వచ్చిన  విధానం ద్వారా భక్తులు తమ పాద రక్షలను సులభంగా డిపాజిట్ చేసితిరిగి వేగంగా పొందగలుగుతున్నారు.


2025 సెప్టెంబర్ నుండి 2026 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 8,45,816 పాద రక్షల డిపాజిట్డెలివరీ లావాదేవీలు  విధానం ద్వారా విజయవంతంగా నిర్వహించబడ్డాయి కాలంలో భక్తుల నుంచి స్వీకరించిన 4,24,047 పాద రక్షల్లో, 4,21,769 పాద రక్షలను సురక్షితంగా తిరిగి అందజేయడం జరిగిందిదాదాపు అన్ని కేంద్రాల్లో పాద రక్షల తిరిగి పొందే శాతం అత్యంత అధికంగా నమోదు కావడం  వ్యవస్థ సమర్థతను ప్రతిబింబిస్తోంది.


వీటిలో ఏటీజీహెచ్ కేంద్రంలో మొత్తం 44,714 పాద రక్షలు సేకరించగావాటిలో 44,340 పాద రక్షలు భక్తులకు పంపిణీ చేయబడ్డాయికృష్ణ తేజ సర్కిల్ కేంద్రంలో 56,019 పాద రక్షలు సేకరించగా, 55,428 పాద రక్షలు పంపిణీ అయ్యాయిమాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో 55,238 పా రక్షలు సేకరించబడగా, 54,928 పాద రక్షలు భక్తులకు అందించబడ్డాయిపీఏసీ-5 కేంద్రంలో అత్యధికంగా 1,38,270 పాద రక్షలు సేకరించగావాటిలో 1,37,904 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి. అదే విధంగా రామ్ భగీచ విశ్రాంతి గృహం కేంద్రంలో 76,556 పాద క్షలు సేకరించగా, 76,071 పాద రక్షలు పంపిణీ అయ్యాయివైకుంఠం క్యూ కాంప్లెక్స్ కేంద్రంలో 53,250 పాద రక్షలు సేకరించబడగా, 53,098 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి.


ప్రత్యేకించి రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో  విధానం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందిఫిబ్రవరి 1 నుండి 15 తేదీ వరకు కేవలం 15 రోజుల్లోనే 1,35,314 పాద రక్షల లావాదేవీలు జరగడం ద్వారా రద్దీ సమయాల్లోనూ  వ్యవస్థ ఎంత వేగంగాక్రమబద్ధంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది.


గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాద రక్షలు అస్తవ్యస్థంగా పడి ఉండటంభక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ చౌదరి  సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక చోరవ తీసుకుని  విధానానికి శ్రీకారం చుట్టారు.


కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ ఆధ్వర్యంలో పాద రక్ష నిర్వహణలో పారదర్శకతక్రమబద్ధత పెరగడంతో భక్తులకు కలిగే ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి.


 నూతన విధానంపై భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 


గతంలో పాద రక్షలు తప్పిపోవడంగందరగోళం ఏర్పడడం వంటి సమస్యలు తరచుగా ఎదురయ్యేవనీనూతన ట్రాకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత  సమస్యలు దాదాపుగా పూర్తిగా తొలగిపోయాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంసిబ్బంది సంఖ్యను పెంచడం వంటి చర్యలతో  వ్యవస్థను రింత విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు


త్వరలో కల్యాణకట్టబేడి ఆంజనేయస్వామి ఆలయంఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


తిరుమల నాలుగు మాడ వీధుల్లో పాదరక్షల వాడకం నిశిద్దo


తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాడ వీధుల్లో దాదాపు ప్రతి రోజూ స్వామి వారు విహరిస్తారు కనుక పాద రక్షలు ధరించడం నిషిద్ధంకావున భక్తులు తప్పనిసరిగా పాద రక్షల కొరకు టీటీడీ ర్పాటు చేసిన  నూతన విధానాన్ని వినియోగించుకోగలరు.


 ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ వల్ తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగుపడటమే కాకుండాభక్తులకు సౌకర్యవంతమైనఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించడమే ప్రధాన లక్ష్యంగా టీటీడీ 


 Smart Shoe Keeping విధానాన్ని అమలు చేస్తోంది.

No comments:

Post a Comment