18.2.26

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం JUBILEEHILLS TEMPLE





హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఉదయం 10.30 గం.లకు  శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారువేద పండితు మంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాలుభక్తుల గోవింద నామస్మరణ మధ్  కార్యక్రమం నిర్వహించారుఇందులో భాగంగా శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించిప్రత్యేక పూజలు చేపట్టి ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను , ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్షణంకంకణబట్టార్ గా శ్రీ పి.కృష్ణసాయి ఆధ్వర్యంలో  కార్యక్రమం జరిగింది


ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


17-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం –  . 10.30 – 11.00 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


18-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


19-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


20-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


21-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం. నుండి 09.00 గం. వరకు)


22-02-2026


ఉదయం – హనుమంత వాహనం


రాత్రి – గజ వాహనం


23-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


24-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


25-02-2026


ఉదయం – చక్రస్నానం(. 08.00 నుండి 10.00 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)


26.02.2026.


మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .


జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా టిటిడి పటిష్ట చర్యలు చేపట్టిందిభక్తులను ఆకట్టుకునేలా విద్యుత్పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారుచలువ పందిళ్లుక్యూ లైన్లుతాగునీరుఅన్నప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ  ఏర్పాటు చేసారుబ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

 స్వామి వారి వాహన సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 


 కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుజూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్..సి ప్రెసిడెంట్ శ్రీ విరెడ్డిఏఈవో శ్రీ రమేశ్టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్శ్రీ హరికృష్ణపలువురు అధికారులుభక్తులు పాల్గొన్నారు

No comments:

Post a Comment