11.2.26

ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి mutyapupandiri








శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయ మర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.


రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారువాహనం ముందు గజరాజులు నడుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా ర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడుప్రత్యేకంగా నస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడుజ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోందిసముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటిచల్లని ముత్యాల కిం నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టిభక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.


వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్కంక‌ణ‌బ‌ట్టార్‌ శ్రీ బాలాజి రంగాచార్యులుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న శేఖ‌ర్‌ఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment