12.2.26

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి రాజ‌సం kalpa vruksha vahanam












శ్రీనివాసమంగపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీదేవిభూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ  రాజమన్నార్‌ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారుశ్రీ‌వారు చిలుకతో కూడిన దండంఆవు దూడలక్ష్మీ హారముమకర కంఠిస్వర్ణ యజ్ఞోపవీతంకల్కితురాయిసూర్యచంద్రులతో కూడిన కిరీటంశ్రీ‌దేవిభూదేవి అమ్మ‌వార్లు గజలక్ష్మిమామిడి పిందుల హారంకమలలంబ హస్తలతో భక్తులను కటాక్షించారు.


ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారువాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి :


క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయివాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుందిఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయిఅలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుందిఅటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.


కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల రకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుందిరాత్రి 7 గంటల నుండి 8 గంటల రకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


వాహ‌న‌సేవ‌లో  ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్సూపరింటెండెంట్ ర‌మేష్‌కంకణభట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇతర అధికారులువిశే సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment