టిటిడి
ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో మంగళవారం క్యారమ్స్, కబడ్డీ, షటిల్ పోటీలు జరిగాయి. ఆ పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
- పురుష ఉద్యోగుల కబడ్డీ పోటీలలో శ్రీ ప్రతాప్ కుమార్ జట్టు విజయం సాధించగా, శ్రీ మోహన్‌బాబు జట్టు రన్నరప్‌గా నిలిచింది.
- 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల పాసింగ్ లగేజి పోటీలలో శ్రీమతి కవిత విజయం సాధించగా, శ్రీమతి శాంతి రన్నరప్‌గా నిలిచింది.
- 45 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగుల టెన్నికాయిట్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి శ్రీదేవి విజయం సాధించగా, శ్రీమతి ఝాన్సీ రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్ డబుల్స్ పోటీలలో శ్రీమతి అనురాధ, శ్రీమతి శ్రీదేవి విజయం సాధించగా, శ్రీమతి ఝాన్సీ, శ్రీమతి బాలమ్మ రన్నర్‌గా నిలిచారు.
- విశ్రాంత మహిళా ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీమతి లలితమ్మ, శ్రీమతి సుమతి జట్టు విజయం సాధించగా, శ్రీమతి దేవికా రాణి, శ్రీమతి లోకేశ్వరి జట్టు రన్నరప్ గా నిలిచింది.
- పురుష ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీలలో శ్రీ శ్రీకాంత్ విజయం సాధించగా, శ్రీ సునీల్‌కుమార్ రన్నరప్ నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీ శ్రీకాంత్, శ్రీ చంద్రశేఖర్ విజయం సాధించగా, శ్రీ సునీల్‌కుమార్, శ్రీ నాగరాజు రన్నర్‌గా నిలిచారు.
- మహిళా ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి సంపూర్ణమ్మ, విజయం సాధించగా, శ్రీమతి ప్రసన్న రన్నరప్‌గా నిలిచింది.
- పాక్షిక అంధుల విభాగం చెస్ పోటీల్లో శ్రీ బి.బాబునాయుడు విజయం సాధించగా, శ్రీమతి రామాంజమ్మ రన్నర్‌గా నిలిచారు.
No comments:
Post a Comment