10.2.26

క్రీడలతో మానసిక, పని ఒత్తిళ్లను అధిగమించవచ్చు – టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి sports meet










శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగులు ఎదుర్కొనే మానసి మరియు పనిఒత్తిడులను క్రీడల ద్వారా సమర్థంగా అధిగమించవచ్చని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారుటిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఈవోఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ చేయించారుఅనంతరం పలువురు ఉన్నతాధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిబెలూన్లు మరియు శాంతి కపోతాలను ఎగురవేశారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూటిటిడి ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతోబాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారుక్రీడలు జీవితం యొక్క భాగమైతే శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసంసమయపాలనప్రణాళికా దృక్పథంసానుకూల ఆలోచనమంచి ప్రవర్తనక్రమశిక్షణకార్యనిర్వహణ నైపుణ్యంనాయకత్వ లక్షణాలుసంక్షోభ నిర్వహణ సామర్థ్యం మరియు అందరిని కలుపుకుని ముందుకు సాగే త్వం అలవడతాయని చెప్పారు.


మన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుందని తెలిపారుఉద్యోగుల సంక్షేమంమానసిక వికాసం దృష్ట్యా 1977 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడాపోటీలను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారుప్రతి ఉద్యోగి రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.


అదనపు ఈవో వాలీబాల్ మ్యాచ్‌తో క్రీడాపోటీలను ప్రారంభించారుపురుషులుమహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులుసీనియర్ అధికారులురిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు క్రీడల్లో టగ్ ఆఫ్ వార్చెస్వాలీబాల్క్యారమ్స్బాల్ బ్యాడ్మింటన్ఫుట్‌బాల్టేబుల్ టెన్నిస్క్రికెట్షటిల్టెన్నిస్ తదితర అంశాలు ఉన్నాయి.

కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పీఆర్వో కుమారి నీలిమ వ్యవహరించారు.


 కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ ఆనంద రాజుడిప్యూటీ వోలు శ్రీమతి వి.ఆర్శాంతిశ్రీ సెల్వంశ్రీ రాజేంద్ర కుమార్సీపీఆర్వో డాటిరవిగార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ఇతర ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment