నాగలాపురంలో
ని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో ఆదివారం రాజగోపురానికి మరియు ఆలయానికి శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రక్తంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం నుండి కూడా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపను పొందారు.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గర్భాలయంలో మూలమూర్తులకు మహా సంప్రోక్షణాన్ని 62మంది రుత్వికులు ఆగమోక్తంగా నిర్వహించారు.
మహా సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. కార్యక్రమం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగింది. ఈ యావత్ కార్యక్రమాన్ని భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి మరియు డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఎస్.ఈ.ఇంచార్జి శ్రీ నరసింహమూర్తి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓ జనరల్ శ్రీ శివప్రసాద్, ఎస్టేట్ అధికారిణి శ్రీమతి సువర్ణమ్మ, ఆలయ సూపరింటెండెంట్ శ్రీధర్మయ్య ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment