22.2.26

టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన జేఈవో డాక్టర్ ఎ. శరత్ ఆరు రకాల అగరబత్తుల తయారీ ttd jeo h&e









తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యండాక్టర్ శరత్ శనివారం సాయంత్రం పరిశీలించారు.


 సందర్భంగా తయారీ ప్రక్రియనాణ్యత ప్రమాణాలుముడిసరుకు వినియోగంప్యాకేజింగ్ విధానం తదితర అంశాలను పరిశీలించారుకేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూప్రస్తుతం  కేంద్రంలో ఆరు రకాల అగరబత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారువీటిలో చామంతిగులాబీతామర పూల సుగంధాలతో అగరబత్తులు తయారు చేస్తున్నారని వివరించారు.


అదనంగా సంపంగివెయ్యి వరహాలుతులసి సుగంధాలతో మరో మూడు కొత్త రకాల అగరబత్తులను త్వరలో తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారుభక్తుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైనఆధ్యాత్మి వాతావరణాన్ని కలిగించే ఉత్పత్తులను అందించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  అగరబత్తుల తయారీ కార్యక్రమం ద్వారా గోసంరక్షణశాలలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భక్తులకు శ్రేష్ఠమైన ధూప ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు.


అనంతరం ఎస్వీ గోశాలను పరిశీలించారుగోవులుపేరు దూడలుఏనుగులు ఇతర పశువులు ఉన్న షెడ్లలో సమయానికి దానాతాగునీరువైద్య సదుపాయంపరిశుభ్రతఎస్వీ గోశాల నుండి పాలను తరలించే సమయాన్ని తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు


 కార్యక్రమంలో  టిటిడి గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్అగరబత్తి ఉత్పత్తి కేంద్రం అధికారులుగోశాల అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment