4.3.26

మార్చి 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగ మహోత్సవం - మార్చి 14 అంకురార్పణ




శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 15 తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం రుగనుంది.


ఇందుకోసం మార్చి 14 తేదీ సాయంత్రం 6 గం. నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవంఅంకురార్పణం నిర్వహిస్తారు.


ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందేబ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్లఅధికార అనధికారుల వల్లభక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.


ఇందులో భాగంగా మార్చి 15 ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఇందులో పాలుపెరుగుతేనె,  పసుపు, చందనంకొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారుమధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిమల్లెజాజి సంపంగిరోజాకలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారుఅనంత‌రం సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చిపై స్వామిఅమ్మ‌వార్లు ల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హంచ‌నున్నారు.


మార్చి 14 తేదీ నుండి శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల‌కు టికెట్లు  అందుబాటులో ఉంటాయి.  గృహస్తులు(ఇద్దరురూ.516/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చుపుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 15 నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

No comments:

Post a Comment