31.3.26

ఒంటిమిట్టలో టీటీడీ ఆలయాల వైభవాన్ని తెలియజేసే ఫోటో ప్రదర్శన photo exhibition






ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాల మగ్ర సమాచారాన్ని భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచిందిఒంటిమిట్టలోని పీఏసీకి ఎదురుగా టీటీడీ సమాచార విభాగం ఆధ్వర్యంలో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.


 ప్రదర్శనలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ చరిత్రఆలయంలోని అద్భుత శిల్పకళా వైభవంశిల్ప సంపదకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారుఅలాగే జాంబవంతుడు, తాళ్లపాక అన్నమాచార్య విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు.


అదేవిధంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, నందలూరు సౌమ్యనాథస్వామి దేవాలయంజమ్మలమడుగు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వంటి ఆలయాలతో దేశవ్యాప్తంగారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల వివరాలను కూడా ప్రదర్శనలో పొందుపరిచారు.


ప్రతి ఆలయానికి సంబంధించిన చరిత్రస్థాపన నేపథ్యంప్రత్యేకతలుఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆయా ఆలయాలకు చేరుకునే మార్గాల వివరాలను సవివరంగా తెలియజేశారు సమాచారం భక్తులకు భవిష్యత్తులో ఆలయ దర్శనాలకు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఎంతో పయుక్తంగా ఉంటుంది.


బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు  ప్రదర్శనను తిలకించి టీటీడీ ఆలయాల చరిత్రవైభవంవిశిష్టతలను తెలుసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.


No comments:

Post a Comment