ఒంటిమిట్టలోని
శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీమతి సవిత పిలుపునిచ్చారు.ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం ఆమె జిల్లా మరియు టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏప్రిల్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సమర్పించే పట్టు వస్త్రాల కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ ఏర్పాట్ల వివరాలను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సవిత మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో టీటీడీ, జిల్లా మరియు పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment