9.4.26

భక్తి వైభవంతో శ్రీ భాష్యకార్ల ఉత్సవాలు ఏప్రిల్‌ 13 నుండి 22 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహణ




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జగద్గురు శ్రీ భాష్యకారులు వారి వార్షిక ఉత్సవాలు ఏప్రిల్‌ 13 నుండి 22 తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.


 ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు దయం 7.30 గంటలకు శ్రీ భాష్యకారులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్తారుసాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడ వీధులలో విశేష ఉత్సవం జరుగుతుందిఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనంసాత్తుమొరస్థానం కార్యక్రమాలు జరుగనున్నాయి.


 ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్‌ 21 భోగి తేరు, 22 సాత్తుమొర వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయిఅనంతరం ఏప్రిల్‌ 23 గంధపొడి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.


 పవిత్ర ఉత్సవాలలో భక్తులు అధి సంఖ్యలో పాల్గొని శ్రీ భాష్యకారుల వారి కటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

No comments:

Post a Comment