19.4.26

పెన్నానది తీరాన భక్తి వెలుగులు… శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వైభవోత్సవం జమ్మలమడుగులో ఏప్రిల్ 30 నుండి మే 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams




కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 10 తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారుఏప్రిల్ 30 అంకురార్పణంతో  ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి.


బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటలకురాత్రి 7 గంటలకు స్వామివారి వాహనసేవలు జరుగుతాయిమే 10 తేదీన సాయంత్రం గంటలకు పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.


వాహనసేవల ముఖ్య కార్యక్రమాలు


మే 1

ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 వరకు)

రాత్రి – పెద్దశేష వాహనం


మే 2

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం


మే 3

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – సింహ వాహనం


మే 4

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – హనుమంత వాహనం


మే 5

ఉదయం – పల్లకీ ఉత్సవం

రాత్రి – గరుడ వాహనం


మే 6

ఉదయం – సర్వభూపాల వాహనం

సాయంత్రం 6 గంటలకు – కల్యాణోత్సవం

రాత్రి 8 గంటలకు – గజ వాహనం


మే 7

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం


మే 8

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం


మే 9

ఉదయం – చక్రస్నానం (ఉదయం 10.45 నుండి 11.05 వరకు)

రాత్రి – ధ్వజావరోహణం


కల్యాణోత్సవం వివరాలు


మే 6 తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారురూ.300/- చెల్లించి గృహస్తులు  సేవలో పాల్గొనవచ్చుపాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెఒక లడ్డుఒక అప్పం, అన్నప్రసాదాలు అందజేస్తారు.


భక్తి కార్యక్రమాలు


 బ్రహ్మోత్సవాల సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుఅన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతంహరికథలుకోలాటాలు తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయిభక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరడమైనది.


స్థల పురాణం


పవిత్ర పెన్నానది తీరాన ఉన్న జంబులతో నిండిన మడుగు ప్రాంతం కాలక్రమంలో జమ్మలమడుగుగా మారినట్లు చెబుతారుస్థలపురాణం ప్రకారం నారాపురయ్య అనే భక్తునికి శ్రీ వేంకటేశ్వర స్వామి కలలో దర్శనమిచ్చి తనను ప్రతిష్టించమని జ్ఞాపించగామడుగులో లభించిన స్వామివారి విగ్రహాన్ని ఉత్తర దిశలోని ఇసుకదిన్నెలో ప్రతిష్టించారుఅందువల్ల  ఆలయం “శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.


కాలక్రమంలో శిథిలమైన  ఆలయం 1919లో భక్తుల సహకారంతో పునర్నిర్మించబడిందిఅనంతరం 2008 అక్టోబర్ 23  ఆలయం టీటీడీ ఆధీనంలోకి వచ్చిఅప్పటి నుండి నిత్యపూజలుఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment