ఒంటిమిట్ట
శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి అశ్వవాహనంపై స్వామివారు కటాక్షించారు.
రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment