25.4.26

మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు govindaraja Swamy vari temple




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.


వివరాలు ఇలా ఉన్నాయి.


మే 1 శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగుతుంది.


మే 8, 15 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు.


మే 9 శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.


మే 12 హనుమజ్జయంతి జరుపుకుంటారు.


మే 18 రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతారుఅదే రోజు ఆలయంలో కోయిల్ ళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.


మే 21 నుండి 30 తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవాలు జరుగుతాయి.


మే 22 శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.


మే 23 నుండి 31 వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు,  23 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.


మే 27 గరుడవాహనంమే 30 రథోత్సవం నిర్వహిస్తారు.


మే 31 చక్రస్నానంధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

No comments:

Post a Comment