తిరుపతి
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment