29.1.26

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష ttd addl eo





తిరుమలలో ఫిబ్రవరి 1 తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో  శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూతిరుమలలో జరిగే అతి ముఖ్యమై తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


భక్తుల కోసం షామియానారేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలుడిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారుటీటీడీ భద్రతాసిబ్బందిపోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారుభక్తుల సౌకర్యార్థం భద్రతఅన్నప్రసాదంతాగునీరువైద్యంఆరోగ్యంఅటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారుపాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు.


అధిక బరువుఆస్తమాగుండె సంబంధిత సమస్యలుఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులనుచిన్న పిల్లలను అనుమతించబోమని తెలియజేశారుపాపవినాశనం వద్ద భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతించాలని చెప్పారుభక్తులకు అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించేందుకు రెండు అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


ప్రైవేట్ వాహనాలుద్విచక్ర వాహనాలను ఫిబ్రవరి 1 తేదిన పాపవినాశనానికి అనుమతించని కారణంగా  గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఎస్ఆర్టీసీ నుండి బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారుఫిబ్రవరి 1 తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను  తీర్థానికి నుమతించనున్నట్లు తెలిపారు


No comments:

Post a Comment