తిరుపతి
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి చంద్రప్రభ వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.
వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment