23.2.26

శ్రీ అనంతాళ్వార్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం: టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్ ttd jeo






శ్రీవైష్ణవ క్తాగ్రేసరుడుఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వార్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని టీటీడీ జేఈవో డాక్టర్ .శరత్ తెలియజేశారుతిరుమలలోని అనంతాళ్వార్ తోట (పురశైవారితోటలో శ్రీ అనంతాళ్వార్ 972 అవతార మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.


 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అనంతాళ్వార్ అవతార మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని తెలిపారుభక్తి అంటే ప్రార్థన మాత్రమే కాదనిభక్తి అంటే సేవ అని నిరూపించిన మహానుభావుడు అనంతాళ్వార్ అని కీర్తించారు. 972 సంవత్సరాలుగా అనంతాళ్వార్ వంశీకులు శ్రీవారికి పుష్ప కైంకర్యం చేస్తున్నారనివారి పరంపర ల్లప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు.


 సందర్భంగా అనంతాళ్వార్ వంశీకులు ''నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠిగానం'' నిర్వహించారు.


అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామితిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.


 సందర్భంగా వేంకటాచల ఇతిహాసమాలరామానుజులవారి తిరుమల యాత్రస్వామి పుష్కరిణి వైభవంశ్రీ రామాయణ కాలక్షేపంతిరుమలనంబి – న్నీరముదు ఉత్సవంమూలవర్ల తిరుమంజనం – తిరునామంతిరుమలలో రామానుజ సన్నిధి ప్రతిష్టసహస్రనామార్చన వైభవంతిరుమలలో జీయర్ మఠం స్థాపనశ్రీవారి సుప్రభాతం-ఏకాంత సేవతిరుమలలో దివ్యప్రబంధ క్రమంతిరుమలలో పుణ్య తీర్థాలు తదితర అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు పన్యసించారు.


 కార్య‌క్ర‌మంలో అనంతాళ్వార్ వంశస్తులు శ్రీ వేంక‌ట కృష్ణ స్వామిశ్రీ భ‌ర‌ద్వాజ‌స్వామిత‌దిత‌రులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment