25.4.26

ధ్వజారోహణంతో ప్రారంభమైన కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి బ్రహ్మోత్సవాలు konetiraya swamy





చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయిఉదయం 9.05 నుండి 9.15 గంటల మధ్య మిథు లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించిసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.


గరుత్మంతుని చిత్రంతో అలంకరించి ధ్వజపటానికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారుఅనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య గరుత్మంతుని ప్రతిరూపాన్ని కొత్త వస్త్రంపై లిఖించిపూజలు చేసిధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారుముందుగా గ్రామ పోలిమేరలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడం జరిగింది.


 రోజు రాత్రి 7 గంటలకు శేషవాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ఆలయ ప్రాముఖ్యత 


కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల ఆదరణ పొందుతోందిస్థలపురాణం ప్రకారం బృగు మహర్షి స్వామివారిని సాలగ్రామ రూపంలో ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఆలయంలోని స్వామివారి విగ్రహం తిరుమల శ్రీవారి మూలవిరాట్‌ను పోలి ఉండటం విశేషంభక్తులు స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతాళ్లపాక అన్నమాచార్యులు  క్షేత్రాన్ని దర్శించి సంకీర్తనలు ఆలపించినట్లు చారిత్రకంగా పేర్కొంటారు.


2012 నవంబర్ 19  ఆలయం టిటిడిలో విలీనం అయిన తరువాత నిత్యకైంకర్యాలుఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నారుప్రతి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారుప్రతి శనివారం సుమారు 200 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారుభక్తులకు నిత్యం అన్నప్రసాదాలు అందిస్తున్నారు.


ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణోత్సవం నిర్వహిస్తారుగృహస్థులు రూ.300 చెల్లించి  సేవలో పాల్గొనవచ్చుపౌర్ణమి పర్వదినాన ఊంజల్ సేవ కూడా భక్తి భావంతో నిర్వహిస్తున్నారు.


 కార్యక్రమంలో టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీకంకణ బట్టార్ శ్రీ శ్రీకాంత్ ఆచార్యులుటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన రమణఅర్చకులుభక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment