2.5.26

ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ponnakalva utsavam



చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్ ఉత్సవం శుక్రవారం వైభవంగా జరిగిందిఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారుఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామిశ్రీ కృష్ణస్వామిశ్రీ ఆండాళ్ అమ్మవారుసేనాధిపతి వారు వేర్వేరు  తిరుచ్చిలపై ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకున్నారు.


అక్కడ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు సందర్భంగా పాలుపెరుగుతేనెపసుపుచందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు తరువాత  అలంకరణసేవాకాలంసాత్తుమొర చేపట్టారుసాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు పొన్నకాల్వ మండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు.


సాయంత్రం 5.30 గంటలకు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు సన్నిధి వీధిగుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందుకు చేరుకునే సమయంలో అక్కడ మహద్వారం యొక్క ఒక లుపును మూస్తారు (శ్రీ పద్మావతి అమ్మవారు తన బావగారైన శ్రీ గోవిందరాజస్వామివారిని మూసిన తలుపుచాటు నుంచి చూస్తుంది అని ఐతిహ్యం). తరువాత తిరుచానూరు నుంచి ఊరేగింపుగా శ్రీ  గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వి.ఆర్.శాంతిఏఈవో శ్రీ నారాయణ చౌద‌రిసూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవిశ్రీ శేషగిరిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధ‌నంజ‌య‌ఇతర అధికారులుఆల అర్చకులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment