18.6.26

శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణ వేగం పెంచాలి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జేఈవో డా. ఎ. శరత్ ఆదేశాలు padmavati children hospital






తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన పనులను నిర్దేశి గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి జేఈవో డా. . శరత్ అధికారులను ఆదేశించారు. టిటిడి ఈవో శ్రీ ఎం. విచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు.


సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనం పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, నిర్ణీత కార్యాచరణ ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


అభివృద్ధి పనుల వేగాన్ని మరింత పెంచేందుకు అవసరమైన నిపుణులు, కార్మికులు, నిర్మాణ సామగ్రిని తక్షణమే సమకూర్చాలన్నారు.  అలాగే మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, గార్డెనింగ్, క్లీనింగ్, నిర్వహణ తదితర మౌలిక సదుపాయాల పనులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు.


భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వారానికోసారి నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనుల స్థితిగతులను పరిశీలిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామన్నారు.


ప్రతి అంతస్తులో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించిన జేఈవో, నాణ్యత విషయంలో రాజీ పడకుండా, ఇంజినీరింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వానికి అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేశారు.


కార్యక్రమంలో డిఎఫ్వో శ్రీ డి. ఫణికుమార్ నాయుడు, ఆసుపత్రి డైరెక్టర్ డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి, ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఈఈలు శ్రీమతి సుమతి, శ్రీమతి సరస్వతి, డిప్యూటీ ఈఈ శ్రీ హర్షవర్థన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Land Allocated for Srivari Temple in Bihar




With an aim to spread the glory of Sri Venkateswara Swamy across the country and as a part of its Hindu Sanatana Dharma activity, TTD has taken up the construction of Srivari temples in state capitals.


In this noble divine mission, the Bihar Government has come forward and allocated 15 acres of land towards the construction of a Srivari temple on the banks of the River Ganges River and near the capital of Bihar Patna, next to the National Highway.


On this occasion, TTD Chairman Sri B.R. Naidu met Bihar Chief Minister Sri Samrat Chaudhary and thanked him. 


The Chief Minister was felicitated with a shawl and a Srivari memento was presented to him. 


Bihar Chief Secretary Sri Amrit Pratyay participated in this event.


Along with the main temple, a Kalyana Mandapam, Pushkarini and other infrastructure required for the convenience of the pilgrims will be set up in the proposed temple premises. 


Keeping in mind the needs of the devotees, steps will be taken to complete the construction work expeditiously.


While the allotment of 10 acres of land for the construction of a Srivari temple in Guwahati, Assam, is already under completion, it is a welcoming aspect that now a land has been allotted towards the construction of a temple near Patna, Bihar. 

బీహార్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు bihar temple





ఉత్తర భారత దేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత చేరువ చేయడానికి మరో కీలక అడుగు పడింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది.


ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి, శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో బీహార్ చీఫ్ సెక్రటరీ శ్రీ అమృత్ ప్రత్యయ్ పాల్గొన్నారు.


ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయంతో పాటు కళ్యాణ మండపం, పుష్కరిణి, యాత్రికుల సౌకర్యాలకు అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.


దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తరించాలనే లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కార్యాచరణ కొనసాగుతోంది.


ఇప్పటికే అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమి కేటాయింపు పూర్తికాగా, ఇప్పుడు బీహార్‌లోని పాట్నా సమీపంలో ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడం విశేషం.


ఉత్తర భారత భక్తులకు తిరుమల శ్రీవారితో అనుబంధాన్ని మరింత పెంచడంతో పాటు, ఈ ఆలయం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. 


Yoga Brings Good Health and Mental Peace -TTD JEO




TTD JEO Dr. A. Sharath said that practising yoga daily helps improve physical health, mental peace, confidence, and inner strength.


He inspected the yoga training programme being conducted at SPW Degree College under the "Yoga–TTD Arogyananda" initiative on Wednesday.


The JEO said that a 15-day yoga training programme for TTD employees is being held from June 7 to 21 as per the directions of TTD EO Sri M. Ravichandra and in line with the vision of Prime Minister Sri Narendra Modi and Chief Minister Sri N. Chandrababu Naidu.


He wished the participants success in the yoga competitions scheduled on June 18, 19, and 20.


Senior TTD officials, faculty members, and staff attended the programme.